- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నంత పని చేసిన కేఏ పాల్..టర్కీ నుండి వీడియో రిలీజ్
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నంత పనిచేశారు. నిన్న తనను టర్కీ వెల్లకుండా ఇండిగో సిబ్బంది అడ్డుకున్నారని రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నంత పనిచేశారు. నిన్న తనను టర్కీ వెల్లకుండా ఇండిగో సిబ్బంది అడ్డుకున్నారని రచ్చ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆయన నేడు టర్కీ వెళ్లి అక్కడ మహదీ అనే వ్యక్తితో కలిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు. మహదీ చైర్మెన్ అని తన పోస్టులో పేర్కొన్నారు. వీడియోలో పాల్ మాట్లాడుతూ... పాకిస్థాన్ కు టర్కీ మిస్సైల్స్ అమ్మింది నిజమేనని అన్నారు. కానీ అమెరికా పాకిస్థాన్ కు మిస్సైల్స్ అమ్మలేదా అని ప్రశ్నించారు.
సౌదీ అరేబియాకు ట్రంప్ మిస్సైల్స్ అమ్మడానికే వెళ్లాడని చెప్పారు. ఈ యుద్దాల్లో ఎంతోమంది మనదేశ పౌరులు ప్రాణాలు కోల్పాయరన్నారు. ఇదే న్యూక్లియర్ వార్ అయితే లక్షలు కోట్ల మంది చనిపోతారన్నారు. అందుకే రష్యా ఉక్రెయిన్ యుద్దం సమయంలో అక్కడ తాను ఉంటానని చెప్పారు. మిస్సైల్స్ ఆపడానికే తాను టర్కీ వెళ్లినట్టు తెలిపారు. యుద్దాలు ఆపాలని అన్నారు. యుద్దం కోసం సామాగ్రిని అమ్మకూడదని అన్నారు. యుద్దాలను మొదలుపెట్టేవారు కాదని ఆపే నాయకత్వం కావాలని చెప్పారు.






