- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India-Pakistan War : పాక్ కాల్పుల్లో మరో సైనికుడి వీర మరణం.. స్వగ్రామానికి సచిన్ యాదవ్ వనాంజే డెడ్ బాడీ
IIndia-Pakistan War : పాక్ కాల్పుల్లో మరో సైనికుడి వీర మరణం.. స్వగ్రామానికి సచిన్ యాదవ్ వనాంజే డెడ్ బాడీ

దిశ, ఫీచర్స్ : భారత్ పాక్ వార్ (India-Pakistan War)నేపథ్యంలో మన సైన్యాలు వీరోచితంగా పోరాడుతున్నాయి. ప్రజలపైకి, ప్రజా స్థావరాలపైకి పాకిస్తాన్ సైన్యాలు పంపుతున్న డ్రోన్లను, మిస్సైల్స్‌ను అడ్డుకుంటూ దేశాన్ని కంటికి రెప్పలా రక్షిస్తున్నాయి. భారత్‌పై దాడికి దిగుతున్న వందలకొద్దీ శత్రుమూకలను తుదముట్టిస్తున్నాయి. ఈ వీరోచిత పోరాటంలో తెలుగువాడైన మురళీనాయక్ ఇప్పటికే అమరుడైన సంగతి తెలిసిందే. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. బార్డర్‌లో పాకిస్తాన్ సైన్యాలతో పోరాడుతున్న మరోసైనికుడు సచిన్ యాదవ్ రావు వనాంజే (29) పాక్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందాడు.
దేశం కోసం పోరాడుతూ నేలకొరిగిన వీర జవాన్సచిన్ యాదవ్ వనాంజే(Sachin Yadav Vananje)ది మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దులో గల నాందేడ్ జిల్లాలోని తమ్లూర్ గ్రామం. చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలని కలలు గనేవాడట సచిన్. అనుకున్నట్లే ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. కాగా మే 10, 2025న ఇండియా పాక్ వార్‌లో భాగంగా పాకిస్తాన్ సైన్యాలను నిలువరించే క్రమంలో(Operation Sindoor)వారు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే ప్రతీ ఒక్కరు అతనికి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. కాగా శనివారం(నేడు) సచిన్ యాదవ్ వనాంజే భౌతిక కాయం ఆయన స్వగ్రామానికి రానున్నట్లు సోషల్ మీడియా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వీర జవాన్ సచిన్ యాదవ్ వనాంజేకు నివాళులర్పిస్తూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.






