Modi: ఆదంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోడీ.. సడెన్ విజిట్ వెనుక వ్యూహం ఇదేనా?

by Prasad Jukanti |   (  Updated:2025-05-13 07:40:57  IST  )

ఆపరేషన్ సిందూర్ లో కీ రోల్ పోషించిన ఆదంపూర్ ఎయిర్ బేస్ ను ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు.

Modi: ఆదంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోడీ..  సడెన్ విజిట్ వెనుక వ్యూహం ఇదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆపరేషన్ సిందూర్‌పై నిన్న రాత్రి కీలక ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) నేడు పాకిస్తాన్ బార్డర్ ప్రాంతంలో పర్యటించారు. ఉదయం పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను (Adampur Airbase) సందర్శించి భారత వైమానిక దళం సిబ్బందితో ముచ్చటించారు. ఆపరేషన్ సిందూర్ (operation sindoor) వివరాలను వారితో పంచుకున్నారు. త్రిశూల్ చిత్రం కలిగిన టోపీ ధరించి వైమానిక స్థావరానికి వచ్చిన ప్రధాని అక్కడ దాదాపు గంటన్నర పాటు గడిపారు. ఈ సందర్భంగా సైనిక సంసిద్ధతను సమీక్షించిన ఆయన వీర జవాన్లతో మాట్లాడి వారిలో మనోధైర్యం పెంచారు. భారతదేశంలో రెండవ అతిపెద్ద సైనిక వైమానిక స్థావరం అయిన ఆదంపూర్ బెస్ పాక్ బార్డర్‌కు వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దేశ రక్షణ వ్యవస్థలో కీలకంగా ఉన్న ఎస్-400 వ్యవస్థ ఈ ప్రదేశంలోనే ఉంది.

పర్యటన వెనుక పక్కా వ్యూహం..

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ దాడులకు కౌంటర్ ఇవ్వడంలో కీ రోల్ పోషించిన ఆదంపూర్ ఎయిర్ బేస్‌ను అకస్మాత్తుగా ప్రధాని సందర్శించడం వెనుక పక్కా వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఆదంపూర్ ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో పెద్దఎత్తున డ్రోన్లను ఇటువైపుగా ప్రయోగించింది. అయితే వాటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఆదంపూర్ సహా భారత్‌కు చెందిన పలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రచారం చేసుకున్నది. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. అంతే కాదు పాకిస్తాన్ సైన్యం చేస్తున్న ఆరోపణల ప్రకారం భారత వైమానిక దళానికి చెందిన ఏ స్థావరానికి నష్టం జరగలేదని మీడియం-రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ద్వారా కూడా స్పష్టం అయింది. ఈ క్రమంలో మోడీ ఆదంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శిచండం ద్వారా పాక్ ప్రచారం ఫేక్ అని రుజువు చేశారు.

Next Story