Operation Sindoor: పాకిస్తాన్ ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌పై డ్రోన్ దాడి

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-08 10:23:45  IST  )

దేశ సరిహద్దుల్లో ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ఆపరేషన్ కొనసాగుతోంది.

Operation Sindoor: పాకిస్తాన్ ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌పై డ్రోన్ దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ సరిహద్దుల్లో ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్‌కు చెందిన దాదాపు రూ.1600 కోట్ల విలువజేసే ఆస్తులను భారత బలగాలు ధ్వంసం చేశాయి. తాజాగా పాకిస్తాన్‌లోని రావల్పిండి ఆర్మీ హెడ్‌క్వార్టర్‌(Pakistan Army Headquarters)పై డ్రోన్ దాడి చేశారు. S-400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌తో పాక్ మిస్సైల్స్‌ను భారత్‌ నిర్వీర్యం చేసింది. చైనా నుంచి పాక్‌ తెచ్చుకున్న HQ9 క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న ఆమెరికా యాత్రికులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, వీలైతే దేశం విడిచి వెళ్లాలని సూచనలు చేస్తోంది. ప్రస్తుతం లాహోర్‌లోని ఎయిర్‌పోర్టు పరిసరాలను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు సరిహద్దుల్లో భారత్ - పాకిస్తాన్ బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.

Next Story