విషాదం.. పాక్ కాల్పులు తెలుగు జవాన్ వీర మరణం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-09 08:02:53  IST  )

విషాదం.. పాక్ కాల్పులు తెలుగు జవాన్ వీర మరణం
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాక్ దేశాల (India-Pakistan war) మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతుండగా.. భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్‌లో పాక్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ (Telugu Jawan) వీర మరణం పొందారు. మృతి చెందిన జవాన్‌ను మురళీనాయక్‌గా గుర్తించారు. ఇతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి (Satyasai) జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లి తండా. రేపు గ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం రానున్నట్లు సమాచారం.

మురళీ నాయక్ తల్లిదండ్రులకు (జ్యోతిరాయి-శ్రీరాముల నాయక్) ఏకైక సంతానం. ఇక సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్‌ విద్యా వ్యాసం చేసిన వీర జవాన్.. 2022లో ఇండియన్‌ ఆర్మీలో చేరాడు. నాసిక్‌లో శిక్షణ పొంది, జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్‌కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. పంజాబ్‌లో పనిచేస్తుండగా.. భారత్-పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు రోజుల క్రితం పంజాబ్ నుంచి జమ్మూకు విధుల నిమిత్తం వెళ్లాడు. అక్కడ పాక్‌ కాల్పుల్లో వీరమరణం పొందాడు.

Next Story