భారత్, పాక్ కాల్పుల విరమణ.. 32 విమానాశ్రయాల్లో రాకపోకలు ప్రారంభం

by Kema Shiva Kumar |

భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ నార్త్, నార్త్ ఈస్ట్ ఇండియా వ్యాప్తంగా మే 15 వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఎయిర్‌పోర్టు (Airports)ను మూసివేసిన విషయం తెలిసిందే.

భారత్, పాక్ కాల్పుల విరమణ.. 32 విమానాశ్రయాల్లో రాకపోకలు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ నార్త్, నార్త్ ఈస్ట్ ఇండియా వ్యాప్తంగా మే 15 వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఎయిర్‌పోర్టు (Airports)ను మూసివేసిన విషయం తెలిసిందే. అయితే, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఇవాళ ఉదయం ఎయిర్ నావిగేషన్ సేవలను నిర్వహించే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (Airports Authority of India) నోటీస్ టు ఏర్‌మెన్ (NOTAM) ఆంక్షలను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వాణిజ్య విమాన సంస్థలు (CARGO) విమానాశ్రయాలకు సంబంధించి రాకపోకలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ (Muralidhar Mohol) పేర్కొన్నారు. దీంతో మొత్తం 32 విమానాశ్రయాల్లో పౌర విమాన కార్యకలాపాలు తక్షణమే అందుబాటులోకి రానున్నాయి. దేశ భద్రత దృష్ట్యా ప్రయాణికులను ఆయా ఎయిర్‌పోర్టులలో క్షుణ్ణంగా తనిఖీ చేయాలని భద్రతా సిబ్బందికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మర్గదర్శకాలు జారీ చేసింది.

కాగా, తిరిగి తెరుచుకున్న విమానాశ్రయాల్లో చండీగఢ్, అమృత్‌సర్, లూధియానా, శ్రీనగర్, పాటియాలా, భుంటార్, కిషన్‌గఢ్, సిమ్లా, భగిందా, కాంగ్రా-గ్గల్, జైసల్మేర్, భుజ్, కాండ్లా, కేశోడ్, పోర్బందర్, హిరాసర్, జామ్‌నగర్, ముంద్రా, లేహ్, జమ్మూ, పఠాకోట్, హల్వారా, బికనీర్, జోధ్‌పూర్ ఉన్నాయి. మరికొన్ని ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలు ప్రారంభం కావడానికి సాయంత్రం వరకు సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

Next Story