- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్‌డ్రిల్.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అలర్ట్
భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలు అయిన గుజరాత్, పంజాబ్ రాజస్థాన్, జమ్మూ కశ్మీర్ లలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ (India), పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలు (Border States of Pakistan) అయిన గుజరాత్, పంజాబ్ రాజస్థాన్, జమ్మూ కశ్మీర్ లలో మాక్ డ్రిల్ (Mock drill) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో సరిహద్దు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం (Government of India) అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే ఉగ్రదాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం మే 7-8 తేదీల్లో జమ్మూ కశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించింది.
ఇందులో భాగంగా భారత వాయుసేన రాఫెల్, మిరాజ్ 2000, సుఖోయ్-30 వంటి యుద్ధ విమానాలతో ఈ విన్యాసాలను చేపట్టింది. ఈ డ్రిల్స్ రాత్రి 9:30 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు నిర్వహించబడ్డాయి. ఈ క్రమంలో సరిహద్దు విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. అదే సమయంలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో దేశవ్యాప్తంగా 244 జిల్లాలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, అలాగే కశ్మీర్, గుజరాత్, హరియాణా, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఈ డ్రిల్స్ జరిగాయి. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అవగాహన కల్పించడం ఈ డ్రిల్స్ లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.






