Pakistan: లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం

by Shamantha N |

భారత్‌ ప్రతీకార దాడులతో పాకిస్థాన్‌(Pakistan) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన దాయాదికి చుక్కెదురైంది.

Pakistan: లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌ ప్రతీకార దాడులతో పాకిస్థాన్‌(Pakistan) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన దాయాదికి చుక్కెదురైంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్‌లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా.. చైనాకు చెందిన హెచ్‌క్యూ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్థాన్‌.. భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్‌, జమ్మూ, పఠాన్‌కోట్‌, అమృత్‌సర్‌, కపుర్తలా, జలంధర్‌, అదామ్‌పుర్‌, భఠిండా, చండీగఢ్‌, నాల్‌, ఫలోడి, భుజ్‌ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే, వీటిని ఇంటిగ్రేటెడ్‌ కౌంటర్‌ యూఏఎస్‌ గ్రిడ్‌, గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది. పాకిస్థాన్‌ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది. దీంతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. పాక్ లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్ లు, సిస్టమ్స్ ని లక్ష్యంగా చేసుకుని ఆర్మీ విరుచుకుపడింది. కాగా.. లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.

Next Story