- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ హైకమిషన్ ఉద్యోగి రెహమాన్‌పై భారత్ వేటు.. భారత సైన్యం సమాచారం మొత్తం ISIకి చేరవేత
భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే చల్లబడి సాధారణ పరిస్థితులు వస్తోన్న వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే చల్లబడి సాధారణ పరిస్థితులు వస్తోన్న వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ హైకమిషన్(Pakistan High Commission) ఉద్యోగి రెహమాన్‌పై భారత్ వేటు వేసింది. రాయబార కార్యాలయ ఉద్యోగి ముసుగులో రెహమాన్ అనే వ్యక్తి కొనసాగుతున్నాడు. డానిష్‌గా పేరు మార్చుకొని పనిచేస్తున్నాడు. గట్టుచప్పుడు కాకుండా భారత సైన్యానికి సంబంధించిన సమాచారం మొత్తం ISIకి చేరవేస్తున్నాడు. గుర్తించి వెంటనే అప్రత్తమైన కేంద్రం రెహమాన్‌పై వేటు వేసింది. రాయబార కార్యాలయంలో ఉండే అర్హతలేని వ్యక్తిగా అధికారిక ప్రకటన చేసింది. అంతేకాదు.. 24 గంటల్లో దేశం విడిచిపోవాలని భారత్ ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరిక చేసింది.
కాగా, కాసేపటి క్రితమే భారత విదేశాంగ శాఖ పాక్‌ను హెచ్చరించింది. మరోసారి తోక జాడిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. భారత్ ఆర్మీకి పుల్ పవర్స్ ఇచ్చామని.. పాకిస్తాన్ నుంచి ఎలాంటి దాడినైనా తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించినట్లు తెలిపారు. పాక్ రెచ్చగొట్టే ప్రతీ చర్యకు ఊహించని విధంగా సమాధానం చెపుతామని అధికారులు ప్రకటించారు.






