ఇక భారత్‌పై ఏమాత్రం జాలి చూపను.. మసూద్ అజార్ సంచలన లేఖ విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-07 08:38:55  IST  )

‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor)లో భాగంగా బవహల్పూర్‌ (Bahawalpur)లోని జైష్-ఎ-మహమ్మద్‌ ప్రధాన స్థావరం అయిన సుభాన్ అల్లా కాంప్లెక్స్‌పై ఇండియన్ ఆర్మీ (Indian Army) బాంబుల వర్షం కురిపించింది.

ఇక భారత్‌పై ఏమాత్రం  జాలి చూపను.. మసూద్ అజార్ సంచలన లేఖ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor)లో భాగంగా బవహల్పూర్‌ (Bahawalpur)లోని జైష్-ఎ-మహమ్మద్‌ ప్రధాన స్థావరం అయిన సుభాన్ అల్లా కాంప్లెక్స్‌పై ఇండియన్ ఆర్మీ (Indian Army) బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో జైష్-ఎ-మహమ్మద్‌ చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) కుటుంబానికి చెందిన మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతమయ్యారు. అందులో అతడి అక్క, బావ, మేనల్లుడు, భార్య కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)పై విషం కక్కతూ.. మసూద్ అజార్ తాజాగా ఓ సంచలన లేఖ విడుదల చేశాడు. అందులో తాను కూడా చనిపోయి ఉంటే బాగుండేదని మసూద్ అజార్ ప్రస్తావించాడు. ప్రధాని మోడీ కశ్మీర్ (Kashmir) విషయంలో అన్ని నియమాలను ఉల్లంఘించారని ఆక్రోశం వెల్లగక్కారు. భారత్‌పై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశాడు. ఇండియాపై ఏమాత్రం జాలి చూపబోమని బీరాలు పలికాడు. భయం లేదు.. నిరాశ లేదు.. దుఖం లేదంటూ చనిపోయాడని అనుకున్న మసూద్ అజార్ రాసిన లేఖ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Next Story