Operation Sindoor: సెలవులన్నీ రద్దు.. వెంటనే విధుల్లో చేరండి : అధికారులకు అమిత్ షా ఫోన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-07 06:32:48  IST  )

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంలో పారా మిలటరీ బలగాల సెలవులన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదేశాలు జారీ చేశారు.

Operation Sindoor: సెలవులన్నీ రద్దు.. వెంటనే విధుల్లో చేరండి : అధికారులకు అమిత్ షా ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంలో పారా మిలటరీ బలగాల సెలవులన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదేశాలు జారీ చేశారు. సెలవులో ఉన్న బలగాలను వెంటనే విధులకు రప్పించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ (CRPF), బీఎస్ఎఫ్ (BSF), ఐటీబీపీ (ITBP) సహా అన్ని పారామిలిటరీ బలగాల అధిపతులకు అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఆదేశించారు. తక్షణమే అందరూ తమతమ విధులకు హాజరు కావాలని సూచించారు. అలాగే జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు కూడా అమిత్ షా కాల్ చేసి మాట్లాడారు. సరిహద్దుల్లో భద్రతపై ఆయన ఆరా తీశారు. ప్రజలకోసం అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆపరేషన్ సిందూర్ పై X వేదికగా స్పందించిన అమిత్ షా.. ఉగ్రమూక సృష్టించిన హత్యాకాండకు సమాధానమే ఆపరేషన్ సిందూర్ అని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలిస్తామని హెచ్చరించారు. మరోవైపు భారత్ మెరుపు దాడుల పట్ల యావత్ దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. పాక్ కు తగిన బుద్ధి చెప్పారంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

Next Story