- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విషయంలో ట్రంప్‌కు గిన్నిస్ రికార్డ్.. సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఏం ఖర్మరా సామీ..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ జె ట్రంప్ నెట్టింట భారీ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. యునైటెడ్ స్టేట్స్ మీడియేటర్‌గా వ్యవహరించడం వల్లే భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణ చేశాయని.. గ్రేట్ ఇంటలిజెన్స్‌తో వ్యవహరించినందుకు

దిశ, ఫీచర్స్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ జె ట్రంప్ నెట్టింట భారీ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. యునైటెడ్ స్టేట్స్ మీడియేటర్‌గా వ్యవహరించడం వల్లే భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణ చేశాయని.. గ్రేట్ ఇంటలిజెన్స్‌తో వ్యవహరించినందుకు రెండు దేశాలకు కంగ్రాట్స్ కూడా చెప్పాడు. పైగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశాడు. వార్‌ను ఆపిన క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ ప్రకటన చేసి గంటలు కూడా గడవకముందే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీంతో నెటిజన్లు ట్రంప్‌ను వేసుకుంటున్నారు.
ఇలాంటి క్రెడిట్ కొట్టేసే పనులతో జోకర్ అయిపోయాడంటూ మీమ్స్ క్రియేట్ చేసిన వాళ్లు కొందరు అయితే నువ్వు చేసిన పనికి నీకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు ఇవ్వాలంటూ ట్రోల్స్ చేస్తున్నారు ఇంకొందరు. మూడు గంటల వరకు కాల్పులను ఆపడంలో మీడియేటర్‌గా వర్క్ చేసిన ట్రంప్‌కు బ్రోకరింగ్ వరల్డ్స్ షార్ట్ సీజ్‌ఫైర్ రికార్డ్ ఇస్తున్నట్లు.. ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఏం ఖర్మరా సామీ అందుకే ట్రంప్‌ను సీరియస్‌గా తీసుకోవద్దని కొందరు అంటుంటే.. ఈ సర్టిఫికేట్‌ను యాక్సెప్ట్ చేయాలని ఇంకొందరు కోరుతున్నారు.






