- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్-2025పై BIG అప్డేట్?
ఇండియా(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో చోటుచేసుకుంటున్న వేళ ఐపీఎల్(IPL) 2025 టోర్నమెంట్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో చోటుచేసుకుంటున్న వేళ ఐపీఎల్(IPL) 2025 టోర్నమెంట్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే.. మళ్లీ ఎప్పుడు పున:ప్రారంభం అవుతుందో తెలియక అభిమానులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఒకవారం పాటు మాత్రమే ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నామని.. తర్వాత పరిస్థితులను బట్టి సురక్షిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆటగాళ్లు, అభిమానుల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో టోర్నీని వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. ‘‘ఓవైపు దేశం యుద్ధం చేస్తుంటే.. ఇలాంటి సమయంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం సరైంది కాదనిపించింది’’ అని వెల్లడించారు. ఇప్పటికే పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్‌లలో మ్యాచ్ భద్రతా కారణాలరీత్యా మధ్యలోనే మ్యాచులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాయిదా వారం రోజులే అని తెలియడంతో ఈసారి కప్ మాదే అనే ధీమాలో ఉన్న జట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
🚨 News 🚨
— IndianPremierLeague (@IPL) May 9, 2025
The remainder of ongoing #TATAIPL 2025 suspended with immediate effect for one week.






