Flights Cancelled: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ఏకంగా 200 విమానాలు రద్దు

by Kema Shiva Kumar |

ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)లో భాగంగా పీవోకే, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో క్షిపణి దాడులు చేపట్టిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మొత్తం 200 విమాన సర్వీసులు రద్దయ్యాయి.

Flights Cancelled: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ఏకంగా 200 విమానాలు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)లో భాగంగా పీవోకే, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో క్షిపణి దాడులు చేపట్టిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మొత్తం 200 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆంక్షల నేపథ్యంలో 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఎయిరిండియా (Air India), ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, అకాసా ఎయిర్ వంటి అనేక విమానయాన సంస్థలు, మరికొన్ని విదేశీ విమానయాన సంస్థలు వివిధ ఎయిర్‌పోర్టుల నుంచి తమ సేవలను రద్దు చేసుకున్నాయి.

తాజా సమాచారం మేరకు దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న 18 ఎయిర్‌పోర్టులు తాత్కాలికంగా మూతబడ్డాయి. అందులో శ్రీనగర్, లేహ్, జమ్మూ, అమృత్సర్, పఠాన్‌కోట్, చండీగఢ్, జోధ్‌పూర్, జైసల్మేర్, సిమ్లా, ధర్మశాల, జామ్‌నగర్, రాజ్‌కోట్, భుజ్, జామ్‌నగర్, బికనీర్ విమానాశ్రయాలు ఉన్నాయి. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మాత్రం దాదాపు 160 విమానాలను రద్దు చేసినట్లుగా వెల్లడించింది. ఇక ఎయిరిండియా జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ స్టేషన్లకు వెళ్లే ఫ్లైట్లను మే 10 వరకు రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి అధికారికంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే సర్వీసులను రద్దు చేసినట్లుగా ఆయన విమానయన సంస్థలు పేర్కొన్నాయి.

Next Story