- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Operation Sindoor : వార్ టైమ్ అలర్ట్‌నెస్.. సరిహద్దు ప్రాంతాల్లో ఉంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

దిశ, ఫీచర్స్ : భారత్ పాక్ మధ్య యుద్ధం కారణంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. దాడులు, ప్రతిదాడులతో ఆయా ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ప్రజలకు నష్టం కలుగకుండా ఇండియన్ ఆర్మీ కేవలం సైన్యాలు, ఉగ్ర స్థావరాలు వంటి వాటిపై దాడిచేస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం మానవత్వం లేకుండా జనావాసాలపైకి క్షిపణులు పంపుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దులు, రిస్కీ జోన్లో ఉన్న ప్రజలు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగపడే వస్తువులను ముందుగానే సమకూర్చుకొని పెట్టుకోవాలని సూచిస్తు్న్నారు. అవేంటో చూద్దాం.
తాగునీరు
వార్ నేపథ్యంలో రోజుల తరబడి కరెంట్ కట్ కావచ్చు. ఎమర్జెన్సీ ఏర్పడి బయటకు వెళ్లలేని పరిస్థితులు ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో నెలకొంటున్నాయి. బ్లాక్ అవుట్లు కొనసాగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే కొన్నిరోజులకు సరిపడా తాగు నీళ్లు తెచ్చుకొని నిల్వచేసుకోవడం మంచిది. అలాగే నల్లా నీళ్లు వంటివి డబ్బాలలోనో, డ్రమ్ముల్లోనో నింపి పెట్టుకోవాలి. ఒకవేళ నీళ్లు దొరకకపోతే అందుబాటులో ఉన్ననీళ్లు తాగాల్సి వస్తుంది. కాబట్టి వాటిని శుభ్రపరిచేందుకు అవసరమైన ఫిల్టర్లు లేదా మాత్రలు వంటివి ఇంట్లో ఉంచుకోవాలి.
పాడవకుండా నిల్వ ఉండే ఆహారం
అత్యవసర పరిస్థితుల్లో వంట చేయడం, బయటకెళ్లి సరుకులు తేవడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఉన్న సమయాన్నే సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కువ రోజులు పాడవకుండా ఉండే ఆహార పదార్థాలను ముందుగానే ప్రిపేర్ చేసి నిల్వ ఉంచుకోండి. డ్రై ఫ్రూట్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటెమ్స్, శనగలు, ఓట్స్, క్వినోవా, గింజలు, గుడ్లు, బ్రెడ్ వంటివి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అత్యవసర పరిస్థితిలో మేలు జరుగుతుంది.
ఫస్ట్ ఎయిడ్ కిట్
బార్డర్‌కు దగ్గరలో లేదా రెడ్ జోన్ గ్రామాల్లో ఉన్న ప్రజలు బయటకు రావద్దని ఆర్మీ అధికారులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటప్పుడు అనుకోని సంఘటనలు సంభవించినా, చిన్న చిన్న గాయాలైనా బయటకు వెళ్లడం రిస్క్‌తో కూడిన పని, కాబట్టి ఇంట్లోనే మీకు మీరు ప్రైమరీ ట్రీట్మెంట్ చేసుకునేలా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎప్పుడూ దగ్గరగా ఉంచుకోవడం మంచిది. అందులో యాంటి సెప్టిక్ బ్లేడ్స్, థర్మామీటర్, బ్యాండేజీలు, ఎమర్జెన్సీలో అవసరం అయ్యే ట్యాబ్లట్స్ ఉండేలా చూసుకోవాలి.
క్లాతింగ్స్, పర్సనల్ హైజీన్
పరిస్థితిని బట్టి శరీరాన్ని నీట్‌గా ఉంచుకోవడానికి, అలాగే ఎండ, చలి, వేడి వంటి వాతావరణాల నుంచి రక్షించుకోవడానికి అవసరమైన బట్టలు ఉంచుకోవాలి. దీంతోపాటు టూత్ పేస్ట్, సబ్బు, షాంపు, టిష్యూస్, పిల్లలకు అవసరం అయ్యే డైపర్స్ వంటివి ముందుగానే సమకూర్చి పెట్టుకోవడం బెటర్.
ముఖ్యమైన పత్రాలు
ఏదైనా ప్రమాదం సంభవిస్తే అవి కాలిపోకుండా, నీటిలో తవడకుండా మీ ఫ్యామిలీకి చెందిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ భద్రంగా ఉంచుకోవాలి. ఒక కవర్లో లేదా పెన్ డ్రైవ్‌లో ఉంచి సేఫ్టీ ప్లేస్‌లో పెట్టుకోండి. ముఖ్యంగా ఆధార్, పాస్ట్ పోర్ట్, హెల్త్ రిపోర్టులు, ఆరోగ్య బీమా, జీవిత బీమా వంటి డాక్యుమెంట్లు జాగ్రత్తగా ఉంచుకోండి. ఎమర్జెన్సీలో చేయాల్సిన ఫోన్ నంబర్లు కూడా నోట్ చేసి అందుబాటులో పెట్టుకోండి.
బ్యాటరీలు, సోలార్ చార్జర్లు
ఇబ్బందికర పరిస్థితుల్లో ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ అవడం కష్టంగా ఉండొచ్చు. ఏవైనా వస్తువులు, పరికరాలు కూడా సమకూర్చుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే కరెంటు లేకపోతే చీకటివేళ ఉపయోగించేందుకు బ్యాటరీలు, ఫోన్ చార్జింగ్ పెట్టుకోవడానికి అవసరం అయ్యే సోలార్ చార్జర్లు, పవర్ బ్యాంకులు వంటివి అందుబాటులో ఉంచుకోండి.
నగదు, ఇతర వస్తువులు
అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్ డౌన్ కావచ్చు లేదా ఆన్లైన్ లావాదేవీలు నిలిచిపోవచ్చు. అలాంటప్పుడు ఏవైనా వస్తువులు కొనాలంటే ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం నగదును కూడా ఇంట్లో ఉంచుకోండి. అలాగే టార్చ్ లైట్, ఇంట్లో కూలర్లు, ఏసీలు, నల్లాలు వంటి వాటికి చిన్న చిన్న రిపేర్లు వస్తే చేసుకోవడానికి అవసరం అయ్యే రెంచ్, సుత్తి, ప్లయర్లు, స్క్రూ డ్రైవర్, డక్ట్ టేప్, జిప్ టైలు వంటివి సిద్ధంగా ఉంచుకోండి.