ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు.. మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-07 09:15:54  IST  )

భారత భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)పై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు.. మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)పై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ (Political Leaders) ఉగ్రవాదుల శిబిరాలపై ఇండియన్ ఆర్మీ (Indian Army) బాంబుల వర్షం కురిపించి వారి కీలక స్థావరాలను నాశనం చేయడం పట్ల తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మీడియాతో చిట్‌చాట్‌‌లో మాట్లాడుతూ.. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పట్ల ప్రతి భారతీయుడు గర్వ పడుతున్నాడని పేర్కొన్నారు.

ఈ సమయంలో ప్రతి పౌరుడు ఆర్మీకి అండగా ఉండాలని పిలుపునిచ్చాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను బాధ్యతలు తాను నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ పార్టీలను పక్కకు పెట్టి ఒక్కటిగా ఉండాల్సిన సమయం ఇది అని అన్నారు. భారత రక్షణ రంగంలో హైదరాబాద్ (Hyderabad) పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో శత్రు దేశం దాడి చేస్తుందన్న సంకేతాల మేరకు రాష్ట్రంలో అన్ని విభాగాలను అప్రమత్తం చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story