- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షోపియన్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని షోపియాన్ (Shopian) జిల్లాలో ఉదయం 10 గంటల ప్రాంతంలో భద్రతా దళాలు, అనుమానిత ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని షోపియాన్ (Shopian) జిల్లాలో ఉదయం 10 గంటల ప్రాంతంలో భద్రతా దళాలు, అనుమానిత ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పులు మొదట కుల్గామ్‌లో ప్రారంభమై షోపియాన్‌లోని షుక్రూ కెల్లర్ ప్రాంతం వరకు కొనసాగాయి. ఎన్‌కౌంటర్ లష్కర్-ఎ-తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమైనట్లుగా భద్రతా బలగాలు వెల్లడించాయి. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, పారామిలటరీ దళాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. పోషియన్ జిల్లా షుక్రూకెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లుగా అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల పహల్గాం టెర్రర్ అటాక్‌లో 26 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో ఉగ్రవాదుల సంచరిస్తున్న సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి.






