Operation Sindoor : ఉద్రిక్తతల వేళ.. సోషల్ మీడియాతో బీకేర్ ఫుల్..!

by Javid Pasha |   (  Updated:2025-05-10 07:01:42  IST  )

Operation Sindoor : ఉద్రిక్తతల వేళ.. సోషల్ మీడియాతో బీకేర్ ఫుల్..!

Operation Sindoor : ఉద్రిక్తతల వేళ.. సోషల్ మీడియాతో బీకేర్ ఫుల్..!
X

దిశ, పీచర్స్ : పహల్గామ్‌లో పాకిస్తాన్ టెర్రరిస్టుల దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తీవ్రరూపం దాల్చింది. యుద్ధంగా మారి శత్రుసేనలను తిప్పికొడుతోంది. అన్యాయంగా, అక్రమంగా భారత్‌పై దాడిచేస్తున్న పాక్ సైన్యాలను ఇండియన్ ఆర్మీ (Indian Army) దీటుగా ఎదుర్కొంటోంది. మిస్సైళ్లు, డ్రోన్లతో వారు చేసే దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూ భారత ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతోంది. అయితే ఇలాంటి భావోద్వేగ, ఉద్రిక్త పరిస్థితుల్లో సోషల్ మీడియాతో జర జాగ్రత్త అంటున్నారు సైబర్ నిపుణులు, పోలీసులు. తప్పుడు కామెంట్లు చేయవద్దని, ఫేక్ న్యూస్(Fake news) ట్రోల్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

అసలే భావోద్వేగాల వేళ.. ఈ సమయాన్ని ఆసరగా చేసుకొని సైబర్ నేరస్థులు(Cybercriminals), పాకిస్థాన్‌కు చెందిన సోషల్ మీడియా గ్రూపులు రెచ్చిపోతున్నాయి. డీప్ ఫేక్, ఏఐ‌తో రూపొందించిన వీడియోలను కొందరు పోస్ట్ చేస్తున్నారు. ఉక్రెయిన్ - రష్యా, ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం నాటి పరిస్థితులను ఫేక్ వీడియోలుగా, చిత్రాలుగా క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై నిఘా ఉంచిన పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. తప్పుడు పోస్టులు పెట్టినా, ట్రోల్ చేసినా, దేశానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసినా కేసులు నమోదు చేస్తామని తెలంగాణ పోలీసులు(Telangana Police) హెచ్చరిస్తున్నారు.

మరోవైపు ఇండియన్ ఆర్మీ(Indian Army)కి వ్యతిరేకంగా కూడా పాకిస్తాన్ సోషల్ మీడియా విషం గక్కుతోంది. కాబట్టి ఏదీ గుడ్డిగా నమ్మకూడదని తెలంగాణ పోలీసులు సహా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సూచిస్తోంది. రీసెంట్‌గా కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న 8 ఖాతాలను(x accounts) బ్యాన్ చేసినట్లు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ x ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ జాగ్రత్తలు తీసుకోండి!

* సైబర్ నిపుణులు, పీబీఐ, తెలంగాణ పోలీసుల సోషల్ మీడియా వేదికలుగా ప్రజలకు కొన్ని సూచనలు చేస్తున్నాయి. దేశ భద్రత, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గానీ, కామెంట్ చేయడం గానీ చేయవద్దు. ఏదైనా ఒక సమాచారం చూసినప్పుడు అది కచ్చితంగా నిజమేనా అని నిర్ధారించుకోవాలి.

* భారత ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారాన్ని చేరవేస్తోంది. వాటిని పరిశీలించాలి. ఉద్రిక్తతలు, భావోద్వేగాలకు సంబంధించిన సమాచారం కనిపిస్తే ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి.

*ప్రజలను భయాందోళనకు గురిచేసే అంశాలపై పోస్టులు చేయవద్దు. ఎవరైనా తప్పుడు సమాచారం, దేశానికి వ్యతిరేకంగా పోస్టులు చేసినట్లు గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా టోల్ ఫ్రీ నంబర్ (100) ద్వారా ఫిర్యాదు చేయాలి.

Next Story