- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ మ్యాచ్ రద్దు.. ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి క్రికెటర్ల తరలింపు
భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా జరుగాల్సిన ఐపీఎల్(IPL) మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా జరుగాల్సిన ఐపీఎల్(IPL) మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. ఢిల్లీ - పంజాబ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. మైదానంలో దాడులు జరిగే అవకాశం ఉందని అనుమానం రావడంతో ప్రేక్షకులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ, పంజాబ్ జట్ల క్రికెటర్లను ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి తరలిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాల ఎయిర్‌పోర్టును మూసివేశారు. రోడ్డు మార్గం గుండా పఠాన్‌కోట్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పఠాన్ కోట్ నుంచి ఢిల్లీకి తరలించనున్నారు. మరోవైపు.. పాకిస్తాన్‌పై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ఒకేసారి త్రివిధ దళాలు రంగంలోకి దిగి.. పాకిస్తాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, సియోల్‌కోట్‌లలో ఎటాక్ చేస్తున్నారు. యుద్ధం విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.






