- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్తాన్ రెచ్చగొడుతోంది.. శ్రీనగర్ నుంచి నలియా వరకు దాడులు చేస్తోంది: Colonel Sophia Qureshi
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై భారత రక్షణశాఖ, విదేశాంగశాఖ కీలక విషయాలు వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై భారత రక్షణశాఖ, విదేశాంగశాఖ కీలక విషయాలు వెల్లడించారు. శనివారం ఢిల్లీలో భారత విదేశాంగ కార్యదర్శి మిస్రీ, కల్నన్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్(Wing Commander Vyomika Singh) మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ దుశ్చర్యలను ప్రపంచం ముందు పెట్టినట్లు వివరించారు. తరచూ పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు. వరుస దాడులతో ఉద్రిక్తతలను పెంచుతోందని తెలిపారు. జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని శ్రీనగర్, బరిండా, ఉదంపూర్‌లో ఇప్పటికే దాడులు చేసిందని చెప్పారు. చిన్నారులు చదువుకునే పాఠశాలలు, ఆస్పత్రులే కేంద్రంగా పాకిస్తాన్ దాడులకు తెగబడుతోందని అన్నారు. శ్రీనగర్ నుంచి నలియా వరకు దాడులకు పాల్పడిందని పేర్కొన్నారు. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
మరోవైపు జైషే, లష్కరే ముఠాల కీలక స్థావరాలే లక్ష్యంగా భారత్ మెరుపుదాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ టార్గెట్ చేసిన వాటిల్లో.. లాహోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని మురిద్కేలోని లష్కరే తోయిబా ఉగ్ర శిబిరం కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబంలోని 10 మంది మృతిచెందినట్లు వార్తలు వచ్చాయి. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులతో పాటు లష్కరే తయ్యిబాకు చెందిన కీలక ఉగ్రవాది, మరో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లుగా పేర్కొంటూ మీడియాలో ఓ జాబితా బయటికొచ్చింది.
మృతుల్లో..
1. ముదస్సర్ ఖదాయిన్ ఖాస్
2. హఫీజ్ మహమ్మద్ జమీల్
3. మహమ్మద్ యూసఫ్ అజార్
4. ఖలీద్ అలియాస్ అబు
5. మహమ్మద్ హసన్ ఖాన్






