- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: నెక్లెస్ రోడ్లో CM రేవంత్ భారీ ర్యాలీ
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత సైన్యానికి సంఘీభావంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ర్యాలీ నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత సైన్యానికి సంఘీభావంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ర్యాలీ నిర్వహించారు. గురువారం సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో పోలీసులు, ఆర్మీ(Army) అధికారులు, మంత్రులు, అధికారులతో పాటు పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌తో భారత్(India) పాకిస్తాన్(Pakistan)కు సరైన సమాధానం చెప్పిందని అన్నారు. ఇకనైనా పాకిస్తాన్ వక్రబుద్ధి మానుకోవాలని హితవు పలికారు. ఉగ్రవాద చర్యలు ఎవరూ ఉపేక్షించరని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలన్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగనీయొద్దన్నారు. హైదరాబాద్‌లోని రక్షణరంగ సంస్థల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.






