మేం పశ్చిమం నుంచి పాక్‌పై ఎటాక్ చేయడానికి సిద్దం.. భారత్‌కు BLA మద్దతు

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-11 13:15:48  IST  )

భారత్‌(India) - పాకిస్తాన్‌(Pakistan)ల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది.

మేం పశ్చిమం నుంచి పాక్‌పై ఎటాక్ చేయడానికి సిద్దం.. భారత్‌కు BLA మద్దతు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌(India) - పాకిస్తాన్‌(Pakistan)ల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి మద్దతు ఇస్తున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army) అధికారిక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా బలూచిస్తాన్ పేర్కొంది. రేపు పాక్‌తో జరుగబోయే చర్చల నేపథ్యంలో భారత్‌ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే తాము సపోర్ట్ చేయడంతో పాటు పశ్చిమం నుంచి పాక్‌పై ఎటాక్ చేస్తామని సంచలన ప్రకటన చేసింది.

కాగా, ఒకవైపు భారత్‌ దాడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్‌కు బలూచిస్తాన్ ఆర్మీ కూడా చుక్కలు చూపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్‌ చేతుల్లో నుంచి బలూచిస్తాన్‌ జారిపోతోంది. భారత్, BLA వరుస దాడులతో పాక్‌ ఆర్మీ బెంబేలెత్తిపోతోంది. ఈ క్రమంలో భారత్‌కు బలూచ్ మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు.. భారత్, పాకిస్తాన్ దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)ల మధ్య సోమవారం (మే 12) కీలక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం అమలు, తదనంతర పరిస్థితులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హాట్‌లైన్ ద్వారా ఈ చర్చలు ప్రారంభమవుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

Next Story