BJP Tiranga Yatra : ఢిల్లీలో మొదలైన బీజేపీ తిరంగ యాత్ర

by Muthe.Rajitha |

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) విజయవంతం అయిన నేపథ్యంలో బీజేపీ "తిరంగ యాత్ర"(BJP Tiranga Yatra) కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

BJP Tiranga Yatra : ఢిల్లీలో మొదలైన బీజేపీ తిరంగ యాత్ర
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) విజయవంతం అయిన నేపథ్యంలో బీజేపీ "తిరంగ యాత్ర"(BJP Tiranga Yatra) కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మే 13 నుంచి 23వ తేదీ వరకు 11 రోజుల పాటు అన్ని రాష్ట్రాల గుండా సాగనున్న ఈ యాత్ర.. మొదటి రోజైన నేడు దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో తిరంగ యాత్ర చేపట్టింది. ఇండియా గేట్(Inida Gate) వద్ద వేల సంఖ్యలో ర్యాలీగా తిరంగ యాత్ర చేసి.. భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈ యాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఎంపీలు, ఇతర నాయకులు, సామాన్య ప్రజలు పాల్గొన్నారు. "వి స్టాండ్ విత్ ఆర్మీ", "నేషన్ విత్ ఆపరేషన్ సిందూర్" వంటి నినాదాలతో ఢిల్లీ వీధులను దద్దరిల్లించారు.

కాగా జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్ పాకిస్తాన్, POK లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడి చేసి వంద మంది ఉగ్రవాదులను హతం చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఈ చర్య అనంతరం సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ కాల్పులకు పాల్పడగా.. వారిని ధీటుగా ఎదుర్కొని గట్టి బుద్ధి చెప్పింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరగడంతో పాక్ దిగివచ్చింది. దీంతో మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందం చేసుకున్నాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో.. బీజేపీ ఈ దేశవ్యాప్త ర్యాలీకి శ్రీకారం చుట్టింది. మే 13 నుంచి 23వ తేదీ వరకు 11 రోజుల పాటు అన్ని రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, పట్టణాల్లో ఈ యాత్ర సాగనుంది.

Next Story