Operation Sindoor: తారా స్థాయికి చేరిన ఉద్రిక్తతలు.. తెలంగాణలో డ్రోన్లపై బ్యాన్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-10 11:35:19  IST  )

భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. దేశంలోని పలు కీలక నగరాలే లక్ష్యంగా పాక్.. డ్రోన్ దాడులకు పాల్పడుతోంది.

Operation Sindoor: తారా స్థాయికి చేరిన ఉద్రిక్తతలు.. తెలంగాణలో డ్రోన్లపై బ్యాన్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. దేశంలోని పలు కీలక నగరాలే లక్ష్యంగా పాక్.. డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. ఈ దాడులను భారత సైన్యంగా ధీటుగా తిప్పికొడుతోంది. వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో డ్రోన్‌ల(Drones)పై నిషేధం విధించింది. ఎయిర్‌పోర్ట్‌కు 10 కిలో మీటర్ల పరిధిలో డ్రోన్లను బ్యాన్ చేశారు. జూన్ 9వ తేదీ వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

Next Story