ఆపరేషన్ సిందూర్ పై అక్కినేని కోడలు పోస్ట్.. ఇప్పుడు నిద్ర లేచావా మహాతల్లి అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆపరేషన్ సిందూర్ పై అక్కినేని కోడలు పోస్ట్.. ఇప్పుడు నిద్ర లేచావా మహాతల్లి అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ తెలుగు అమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్‌(Bollywood0లో బాగా ఫేమ్ తెచ్చుకుంది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకుంది. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya).. సమంత(Samantha)తో విడాకులు తీసుకున్న తర్వాత గత ఏడాది అతన్ని మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. భార‌త సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్‌ ఉగ్రమూకలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం పీవోకే (పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్) తో పాటు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసింది. దీనిపై భార‌తీయులు అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

భార‌త ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’పై దేశ ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అదేవిధంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖులంతా భారత సైనికుల ధైర్య సాహసాలను అభినందిస్తూ ఆపరేషన్ సిందూర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, తార‌క్‌, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, రామ్ గోపాల్ వర్మ, వరుణ్ తేజ్ లాంటి ప్రముఖులంతా సైనికులకి మద్దతు తెలుపుతూ పోస్ట్ చేశారు.

ఈ క్రమంలో తాజాగా అక్కినేని కోడలు శోభిత ‘ఈ క్లిష్ట సమయాల్లో, మన సాయుధ దళాలతో మనం ఐక్యంగా నిలబడదాం. ఈ ఆపరేషన్ ఒక దేశంగా మన సమిష్టి బలాన్ని ప్రదర్శిస్తుంది మరియు ఉగ్రవాదులకు తగిన సమాధానం.. జై హింద్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఇప్పుడు నిద్ర లేచావా మహాతల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story