మేము ఇంకా యుద్ధం మొదలు పెట్టలేదు.. ఆప్ MP కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై ఆప్(AAP) కీలక నేత, ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) కీలక వ్యాఖ్యలు చేశారు.

మేము ఇంకా యుద్ధం మొదలు పెట్టలేదు.. ఆప్ MP కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై ఆప్(AAP) కీలక నేత, ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఇంకా యుద్ధం మొదలుపెట్ట లేదు. ఇప్పటివరకు పాకిస్తాన్‌ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నమే చేసింది. ఒక వేళ తాము యుద్ధం స్టార్ట్ చేస్తే.. ప్రత్యర్థిని ముగించేవరకూ వదిలిపెట్టబోమని కీలక వ్యాఖ్యలు చేశారు. మనం స్నేహితులను మార్చుకోవచ్చు.. కానీ పొరుగు దేశాలను మార్చుకోలేం.. ఒకవేళ పొరుగు దేశం పాకిస్తాన్‌ లాగా ఉంటే.. తప్పుకుండా దానికి తగిన గుణపాఠం చెప్పి తీరాలని అన్నారు. పాక్ కుట్రలను ధీటుగా ఎదుర్కొంటున్న భారత సైన్యానికి రాఘవ్ చద్దా సెల్యూల్ చేశారు.

మరోవైపు ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) కొనసాగుతోంది. గత రెండు రోజలుగా జమ్మూకశ్మీర్, పంజాబ్‌, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్‌ చేసిన డ్రోన్ల దాడులను భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంది. ఆ దాడులకు ప్రతిస్పందనగా భారత ఆర్మీ ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లపై ఎటాక్ చేసి ధ్వంసం చేసింది.

Next Story