- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్లు ధ్వంసం.. భారత సైన్యం అధికారిక వీడియోలు విడుదల
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన టెర్రరిస్టులను హతమార్చింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నిర్వహించిన టెర్రరిస్టులను హతమార్చింది. దీనికి ప్రతీకారంగా పాక్ ఆర్మీ (Pak Army) భారత్ పై దాడులకు పాల్పడుతుంది. కాగా ఈ దాడులను భారత్ తిప్పికొట్టడమే కాకుండా ప్రతి దాడులు చేస్తూ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తుంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారత ఆర్మీ (Indian Army) చేసిన దాడులు, భారత్ పై పాక్ చేసిన దాడి ప్రయత్నాలపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆధ్వర్యంలో కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Wing Commander Vyomika Singh) ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు.
అనంతరం భారత ఆర్మీ అధికారిక ట్విట్టర్ (Official Twitter of Indian Army) అకౌంట్లో ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌లను ధ్వంసం (Terrorist launchpads destroyed) చేసిన వీడియోను పోస్ట్ చేసింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్‌లోని అనేక నగరాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు ప్రయత్నించిన దుస్సాహసాలకు ప్రతిస్పందనగా భారత సైన్యం ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లపై సమన్వయంతో కాల్పులు జరిపి, వాటిని తుడిచిపెట్టి, వాటిని ధ్వంసం చేసిందని ఆర్మీ రాసుకొచ్చింది. అలాగే భారత నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్న ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లు గతంలో భారత పౌరులు, భద్రతా దళాలపై ఉగ్రవాద దాడులను ప్లాన్ చేయడానికి, అమలు చేయడానికి కేంద్రంగా ఉన్నాయి. వాటిని ఈ రోజు భారత ఆర్మీ ధ్వంసం చేసింది.






