తెలంగాణలో టీకా వేసుకుంది 51 శాతం మందే..!

by  |
తెలంగాణలో టీకా వేసుకుంది 51 శాతం మందే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ర్ట వ్యాప్తంగా రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వెరీ స్లోగా నడుస్తున్నది. టీకాపై అపోహలతో కొందరు, అవగాహన లేక మరికొందరు, గతంలో టీకా పొందేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన మార్గదర్శకాలను అనుసరించి కోవిన్‌లో నమోదు చేసుకునేందుకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వంటి కారణాలతో రూరల్ ఏరియాల్లో టీకా పంపిణీ తగ్గినట్టు స్వయంగా అధికారులే చెబుతున్నారు.

ఇప్పటి వరకు రాష్ర్ట వ్యాప్తంగా 1,99,96,263 మంది టీకాలు తీసుకోగా, వీరిలో 1,44,90,525 మంది ఫస్ట్, 55,05,738 మంది రెండో డోసునూ తీసుకున్నారు. అంటే సుమారు 51 శాతం మంది మాత్రమే రెండు డోసులను పొందగా, మరో 49 శాతం మంది ఇప్పటి వరకు టీకా తీసుకోలేదని వైద్యారోగ్యశాఖ గుర్తించినది. దీంతోనే రాష్ర్ట వ్యాప్తంగా ప్రతీ రోజు 3 లక్షల మందికి డోసులు పంపిణీ చేసేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైనది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మరో రెండ్రోజుల్లో ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం షురూ కానుంది.

45 లక్షల డోసులు సిద్ధం..

అన్ని గ్రామాల్లో స్పెషల్ వ్యాక్సినేషన్‌ను నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసింది. సుమారు 200 మొబైల్ వాహనాలతో పాటు కేంద్రం నుంచి 45 లక్షల డోసులను తెప్పించుకుంటున్నది. ఇప్పటికే 20 లక్షల డోసులు రాగా, ఈ నెలాఖరు వరకు మరో 25 లక్షల డోసులు రానున్నట్టు అధికారులు వెల్లడించారు. అంతేగాక వచ్చే నెలలో మరో 30 లక్షల డోసులు కేంద్రం నుంచి సెంట్రల్ స్టోరేజ్ సెంటర్‌కు చేరుకోనున్నాయి.

ఎక్కడికక్కడే…

రాష్ర్ట వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ప్రభుత్వం స్పెషల్ వ్యాక్సినేషన్‌ను నిర్వహించబోతున్నది. మొబైల్ వాహనాలతో ఎక్కడికక్కడే డోసులను పంపిణీ చేయనున్నారు. పీహెచ్‌సీలతో పాటు ఈ వాహనాలను అందుబాటులోకి తేవడం వలన టీకా పంపిణీ మరింత వేగవంతం కానుంది. వీటి ద్వారా మార్కెట్లలో ఉండే జనాలతో పాటు రైతులు, వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులకు స్పాట్‌లో వ్యాక్సిన్ అందివ్వనున్నారు. తద్వారా కనీసం సింగల్ డోసుతోనైనా 100 శాతం వ్యాక్సినేషన్ ను పూర్తి చేయొచ్చని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గత వారంలో అర్బన్ వర్సెస్ రూరల్ ట్రెండ్ ఇలా..

తేది అర్బన్ రూరల్
13 1,20,421 1,14,498
12 22,567 4630
11 1,23,554 93,006
10 4336 843
9 1,07,390 1,02,351
8 43,452 19,030


Next Story

Most Viewed