- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు.. నిజమేనా..?
<p>దిశ, వెబ్ డెస్క్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతుల్ని నిర్వహించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తాజా పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో కాలేజీలు పునప్రారంభమయ్యే పరిస్థితులు కనబడటంలేదు. అయితే, అడ్మిషన్లకు సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. కానీ, ప్రభుత్వం మాత్రం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌పై దృష్టి సారించింది. లెక్చరర్ల నైపుణ్యం, నాణ్యత పెంచేందుకు ‘డిజిటల్ దిశ’ పేరుతో విద్యా శాఖ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టింది. నిర్మాణ్ ఎన్‌జీఓ, కాగ్నిజెంట్ […]</p>

దిశ, వెబ్ డెస్క్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతుల్ని నిర్వహించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తాజా పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో కాలేజీలు పునప్రారంభమయ్యే పరిస్థితులు కనబడటంలేదు. అయితే, అడ్మిషన్లకు సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. కానీ, ప్రభుత్వం మాత్రం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌పై దృష్టి సారించింది. లెక్చరర్ల నైపుణ్యం, నాణ్యత పెంచేందుకు ‘డిజిటల్ దిశ’ పేరుతో విద్యా శాఖ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టింది. నిర్మాణ్ ఎన్‌జీఓ, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ లిమిటెడ్, అడోబ్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ట్రైనింగ్ కార్యక్రమం ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నది. జూలై 14 నంచి 15 రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగనున్నది. ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల రెగ్యులర్, కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ స్కిల్స్ మెరుగుపర్చుకోవడంతో పాటు వేర్వేరు డిజిటల్ టూల్స్, సాఫ్ట్‌వేర్స్, గ్రాఫిక్స్, యానిమేషన్స్ లాంటివి ఉపయోగించుకొని ఆన్‌లైన్‌లో కోర్స్ మెటీరియల్ అందించడం, క్లాసులు తీసుకోవడం లాంటి అంశాల్లో శిక్షణ పొందనున్నారు. ఈ ట్రైనింగ్ పూర్తిగా ఉచితం. రెండు రోజుల పాటు 6 గంటల ట్రైనింగ్ ఉండనున్నది. 12 బ్యాచ్‌లలో 5300 మంది లెక్చరర్లు ట్రైనింగ్ పూర్తి చేయనున్నారు. డిజిటల్ టీచింగ్ మెథడ్స్, డిజిటల్ కంటెంట్ డెవలప్‌మెంట్ లాంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనే లెక్చరర్లు ప్రాజెక్ట్స్ రూపొందించాల్సి ఉంటుంది. వాటిని 12వ రోజు సబ్మిట్ చేయాలి. 15వ రోజు గ్రాడ్యుయేషన్ డే ఉండనున్నది.






