హ్యాపీ యానివర్సరీ కబీర్ సింగ్ : కియారా

by  |
హ్యాపీ యానివర్సరీ కబీర్ సింగ్ : కియారా
X

కబీర్ సింగ్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండను తెలుగులో స్టార్ హీరోను చేసిన అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్. ఇండస్ట్రీకి సరికొత్త ప్రేమ కథతో పాటు విజయ్‌లోని డిఫరెంట్ యాంగిల్‌ను పరిచయం చేసిన ఈ సినిమా.. హిందీలోనూ కబీర్ సింగ్‌గా రికార్డులు సృష్టించింది. సందీప్ వంగా డైరెక్షన్‌లోనే వచ్చిన ఈ సినిమా.. అక్కడ కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై ఈ రోజుకు ఏడాది కాగా.. రెబల్ కబీర్ సింగ్‌కు ఏడాది అంటూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు డైరెక్టర్.

కాగా, తన మనసుకు దగ్గరైన కబీర్ సింగ్ సినిమా గురించి స్పెషల్ పోస్ట్ పెట్టింది హీరోయిన్ కియారా. చిత్రంలోని బెస్ట్ సీన్స్ షేర్ చేసిన భామ.. ‘డియర్ కబీర్ సింగ్ హ్యాపీ యానివర్సరీ’ అని విష్ చేసింది. ప్రీతి మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంది అంటూ.. చిత్రంలో తన క్యారెక్టర్ అంటే ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పింది.

View this post on Instagram

Dear Kabir Singh, Happy anniversary! Love always, Preeti ❤️

A post shared by KIARA (@kiaraaliaadvani) on

ఇక కబీర్ సింగ్ మూవీ సక్సెస్ తర్వాత కియారా.. మంచి మంచి సినిమాల్లో అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్‌లో బెస్ట్ హీరోయిన్‌‌గా కొనసాగుతోందంటే.. ఈ సినిమానే కారణం అంటుంటారు విశ్లేషకులు.



Next Story

Most Viewed