అస్థికలు కలుపడానికిపోతే.. గోదావరిలో ఒకరు గల్లంతు

by Sridhar Babu |

<p>దిశ, కాటారం: గోదావరి నదిలో అస్థికలు కలుపడానికి వెళ్లి ఒకరు గల్లంతైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గోదావరి నదిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ రూరల్ జిల్లా ఐలోని మండలం సింగారం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అస్థికలు కలిపేందుకు కాళేశ్వరం గోదావరి నదికి వచ్చారు. అస్థికలు నదిలో కలుపుతున్న సమయంలో నలుగురు స్నానం చేస్తూ నీటమునిపోయారు. ఇది గమనించిన స్థానికులు ముగ్గురిని రక్షించగా, వీరస్వామి (45 )అనే [&hellip;]</p>

Godavari river
X

దిశ, కాటారం: గోదావరి నదిలో అస్థికలు కలుపడానికి వెళ్లి ఒకరు గల్లంతైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గోదావరి నదిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ రూరల్ జిల్లా ఐలోని మండలం సింగారం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అస్థికలు కలిపేందుకు కాళేశ్వరం గోదావరి నదికి వచ్చారు.

అస్థికలు నదిలో కలుపుతున్న సమయంలో నలుగురు స్నానం చేస్తూ నీటమునిపోయారు. ఇది గమనించిన స్థానికులు ముగ్గురిని రక్షించగా, వీరస్వామి (45 )అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతడి కోసం కాళేశ్వరం ఎస్ఐ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story