- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
<p>శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామాలోని కాకపొరాలో శుక్రవారం తెల్లవారు జామునే మొదలైన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టు ప్రాథమికంగా తెలిసింది. కాగా, మరో ఇద్దరు టెర్రరిస్టులు పోలీసుల వలయంలో చిక్కుకున్నట్టు సమాచారం. ముందస్తు సమాచారం ఆధారంగా కాకపొరాలో ఆర్మీ బలగాలు, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ జరుగుతుండగానే కొందరు ఉగ్రవాదులు తమపై కాల్పులకు తెగబడ్డారని […]</p>

X
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామాలోని కాకపొరాలో శుక్రవారం తెల్లవారు జామునే మొదలైన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టు ప్రాథమికంగా తెలిసింది. కాగా, మరో ఇద్దరు టెర్రరిస్టులు పోలీసుల వలయంలో చిక్కుకున్నట్టు సమాచారం. ముందస్తు సమాచారం ఆధారంగా కాకపొరాలో ఆర్మీ బలగాలు, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ జరుగుతుండగానే కొందరు ఉగ్రవాదులు తమపై కాల్పులకు తెగబడ్డారని వివరించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా రావల్సి ఉన్నది.
Next Story






