- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బయటికి వెళ్లి వస్తానని చెప్పి.. చివరికి ఇలా పొదలలో
<p>దిశ,కోదాడ: మునగాల మండలం విజయరాఘవాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన విషయం బుధవారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయరాఘపురం గ్రామానికి చెందిన గుండు వెంకటేశ్వర్లు కుమారుడు గుండు రమణయ్య(40) మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయల్దేరాడు. పని చూసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు విజయరాఘవాపురం సమీపంలోని చెట్లపొదల్లో పడి మృతి చెందాడు. బుధవారం ఉదయం చెట్లపొదల్లో పడి ఉన్న రమణయ్య […]</p>

దిశ,కోదాడ: మునగాల మండలం విజయరాఘవాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన విషయం బుధవారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయరాఘపురం గ్రామానికి చెందిన గుండు వెంకటేశ్వర్లు కుమారుడు గుండు రమణయ్య(40) మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయల్దేరాడు. పని చూసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు విజయరాఘవాపురం సమీపంలోని చెట్లపొదల్లో పడి మృతి చెందాడు.
బుధవారం ఉదయం చెట్లపొదల్లో పడి ఉన్న రమణయ్య మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రమణయ్య వాహనాన్ని ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందా లేక అతనే అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న తాటి చెట్లను ఢీ కొని మృతి చెందాడా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.






