ఏపీలో రాత్రి నుంచి ఒక్క కేసే నమోదైంది

by Vemula.Srinu Prasad |

<p>ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కాస్త శాంతించినట్టు కనిపిస్తోంది. వైద్యులు పేర్కొనే ఇంక్యుబేషన్ పిరియడ్ చివర్లో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న సాయంత్రానికి ఏపీలో 303 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి నేటి ఉదయం 11 గంటల వరకు ఏపీలో ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదు కావడం విశేషం. ఈ కేసు కూడా గుంటూరు జిల్లాలో జరిగిన పరీక్షల్లో నమోదైంది. దీంతో [&hellip;]</p>

ఏపీలో రాత్రి నుంచి ఒక్క కేసే నమోదైంది
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కాస్త శాంతించినట్టు కనిపిస్తోంది. వైద్యులు పేర్కొనే ఇంక్యుబేషన్ పిరియడ్ చివర్లో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న సాయంత్రానికి ఏపీలో 303 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అయితే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి నేటి ఉదయం 11 గంటల వరకు ఏపీలో ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదు కావడం విశేషం. ఈ కేసు కూడా గుంటూరు జిల్లాలో జరిగిన పరీక్షల్లో నమోదైంది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 74, నెల్లూరులో 42, గుంటూరు 33, కృష్ణా 29, వైఎస్సార్‌ జిల్లాలో 27, విశాఖపట్నం 20, పశ్చిమ గోదావరి 21, చిత్తూరు 17, తూర్పు గోదావరి 11, ప్రకాశం 24, అనంతపురంలో 6 కేసులు నమోదయ్యాయి.

Tags: corona virus, covid-19, andhrapradesh, health bulletin

Next Story