దొంగతనం జరిగి ఐదేళ్లవుతోంది.. నిందితుడు ఇప్పుడు ఇలా దొరికిపోయాడు

by  |
Arrest12
X

దిశ, హుజూర్ నగర్: ఐదేళ్ల క్రితం జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించి నగలు రికవరీ చేశారు. సీఐ రామలింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం 2016 సెప్టెంబర్ 30 న గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన జట్టుకొండ లక్ష్మీనర్సయ్య.. తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళం పగలకొట్టి, దొంగలు 5 తులాల బంగారం, 30 తులాలు వెండి పోయినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండేళ్లు దర్యాప్తు చేసినా సరైన ఆధారాలు లభించకపోవటంతో 2018 లో కేసును మూసివేశారు.

ఇటీవల ఓ కేసు విషయంలో వేలి ముద్రలు సరిపోలటంతో ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన కొమ్మనబోయిన సీతరాములును శనివారం ఉదయం ఆరెస్ట్ చేసి విచారణ జరుపగా.. కీతవారిగూడెంలో జరిగిన దొంగతనం తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం అతని నుంచి నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నగల రికవరీలో తెలివిగా వ్యవహరించిన కానిస్టేబుల్స్ అజిత్ రెడ్డి, నాగరాజు, శంభయ్య, నాగిరెడ్డిని సీఐ రామలింగారెడ్డి అభినందించారు.

Next Story

Most Viewed