మరోమారు కొత్తపేట మార్కెట్ మూసివేత

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌‌లో కరోనా విజృంభిస్తుండడంతో పలు మార్కెట్లు మూసివేస్తున్నారు. ఇటీవల బేగం బజార్, జనరల్ బజార్ తదితర మార్కెట్లను స్వచ్ఛందంగా మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను కూడా ఈ నెల 12 నుంచి మరోసారి మూసివేస్తామని అధికారులు స్పష్టం చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు రైతులు మార్కెట్‌కు రావొద్దని సూచించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కూడా.. మార్కెట్‌లో భౌతిక దూరం పాటించడం లేదని.. ఈ క్రమంలోనే మార్కెట్‌ను [&hellip;]</p>

మరోమారు కొత్తపేట మార్కెట్ మూసివేత
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌‌లో కరోనా విజృంభిస్తుండడంతో పలు మార్కెట్లు మూసివేస్తున్నారు. ఇటీవల బేగం బజార్, జనరల్ బజార్ తదితర మార్కెట్లను స్వచ్ఛందంగా మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను కూడా ఈ నెల 12 నుంచి మరోసారి మూసివేస్తామని అధికారులు స్పష్టం చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు రైతులు మార్కెట్‌కు రావొద్దని సూచించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కూడా.. మార్కెట్‌లో భౌతిక దూరం పాటించడం లేదని.. ఈ క్రమంలోనే మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.

Next Story