టీ20 వరల్డ్ కప్‌కు మేం ఆతిథ్యం ఇస్తాం: ఒమన్

by  |
టీ20 వరల్డ్ కప్‌కు మేం ఆతిథ్యం ఇస్తాం: ఒమన్
X

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కారణంగా ఇండియాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించడం సాధ్యం కాకపోతే తాము ఆతిథ్యం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు ఒమన్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ‘మాకు అవకాశం ఇస్తే విజయవంతంగా నిర్వహించి చూపిస్తాము. అయితే ఈ విషయంపై తొలి నిర్ణయం ఐసీసీ, బీసీసీఐ తీసుకోవాలి. కాగా, ఒమన్ ఈ మెగా ఈవెంట్ నిర్వహించడానికి సరైన వేదిక’ అని ఒమన్ క్రికెట్ బాస్ పంకజ్ ఖిమ్జీ అన్నారు. ‘ఒమన్‌లో ఉన్న స్టేడియంలు టీ20 వరల్డ్ కప్ నిర్వహించడానికి అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికే ఇక్కడ అంతర్జాతీయ టీ20, వన్డే, టెస్టులు నిర్వహించడానికి మాకు ఐసీసీ అనుమతులు కూడా ఇచ్చింది’ అని ఆయన అన్నారు.

కాగా, ఒక వేళ టీ20 వరల్డ్ కప్ కనుక యూఏఈకి తరలిస్తే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఒమన్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా, టీ20 వరల్డ్ కప్‌పై తుది నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐకి ఐసీసీ జూన్ 28 వరకు సమయం ఇచ్చింది. ఆ తర్వాత ఈ మెగా ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అనే దానిపై స్పష్టత వస్తుంది.


Next Story