తాత ప్రేమకథ మాములుగా లేదుగా.. 18వ ఏట ప్రేమ.. 65 ఏళ్లకు పెళ్లి

195
love-Marriage1

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటారు. ఎప్పుడు, ఎక్కడ ఎవరితో మొదలవుతుందో తెలియదు. కానీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలామంది అనుకుంటారు కానీ ఆ కోరిక కొందరికే నెరవేరుతోంది. మిగతావారు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అవుతారు. కానీ ప్రేమించిన అమ్మాయి కోసం కొన్ని సంత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఏ అబ్బాయి వెయిట్ చేయలేడు. కానీ కర్ణాటకలోని మాండ్యం జిల్లా మేలుకోటెలో ఓ తాత ప్రేమ కథ వింటే అందరూ వాహ్ అనాల్సిందే. తాత తన 18ఏటా జయమ్మ‌ను ప్రేమించాడు. ఎంతలా అంటే తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. కానీ జయమ్మకు వేరే వారితో వివాహం జరిగింది. తాత మాత్రం ఆమె జ్ఞాపకాలనే నెమరువేసుకుంటూ బతికేశాడు. ప్రస్తుతం అతడి వయసు 65 సంవత్సరాలు. అయితే జయమ్మకు వేరే వ్యక్తితో వివాహం జరిగాక తన భర్తను కోల్పోయింది. పిల్లలు కూడా లేరు. అయితే, 65 సంవత్సరాల వయసులో కూడా వీరి ప్రేమ అలాగే మిగిలిపోయింది. ఇప్పటికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. దీంతో వీరి ప్రేమను బతికించుకోవడం కోసం సమాజ కట్టుబాట్లను చీల్చుకుని 65 ఏళ్ల వయసులో శాస్త్రోక్తంగా పెళ్లాడి ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వీరిని చూసిన వారందరూ ఇదిరా.. ప్రేమంటే అంటున్నారు. ఎంతైనా ఇక్కడ తాత గ్రేట్ అని చెప్పాలి అని మరికొందరు అంటున్నారు. ప్రేమ ఓడి నిలిచిందని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.