- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి లేక వృద్ధుడు ఆత్మహత్య
<p>దిశ, ఎల్బీనగర్: కరోనా సమయంలో ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సురాబాద్ డివిజన్, వీకర్ సెక్షన్ కాలనీలో నివాసముంటున్న భిక్షపతి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు మహేష్, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా నాలుగు నెలలుగా భిక్షపతి కుటుంబం ఉపాధిని కోల్పోయింది. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనోవేదనకు గురైన […]</p>

X
దిశ, ఎల్బీనగర్: కరోనా సమయంలో ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సురాబాద్ డివిజన్, వీకర్ సెక్షన్ కాలనీలో నివాసముంటున్న భిక్షపతి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు మహేష్, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా నాలుగు నెలలుగా భిక్షపతి కుటుంబం ఉపాధిని కోల్పోయింది. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనోవేదనకు గురైన భిక్షపతి శుక్రవారం రాత్రి ఇంటి ముందున్న రేకుల కింద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






