దారి కోసం అన్నను రక్తం వచ్చేలా కొట్టిన తమ్ముడు

102

దిశ, మానకొండూరు: కేశపట్నం మండలంలోని అర్కండ్ల గ్రామంలో ఆస్తి కోసం అన్నపై తమ్ముడు కుటుంబంతో కలిసి దాడి చేశాడు. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన నేదునూరి రామస్వామి, సోదరుడు నేదునూరి రామయ్యలకు గత కొంతకాలంగా వ్యవసాయ భూముల వద్ద దారి కోసం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం అన్న రామస్వామి పశువుల మేతకు వెళ్లగా.. తమ్ముడు రామయ్య అతని భార్య లక్ష్మి వ్యవసాయ భూమి వద్ద దాడి చేశారు. ఈ దాడిలో రామస్వామి తలకు తీవ్ర గాయాలు కాగా, చేయి కూడా విరిగిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..