ఆధిపత్యం దిశగా ఆఫ్‌లైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

by  |
ఆధిపత్యం దిశగా ఆఫ్‌లైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : చిన్న పట్టణాలు, నగరాల్లో ఎక్కువ వ్యాపారం జరిగే ఆఫ్‌లైన్ రిటైల్ అమ్మకాలు 2021లో తిరిగి బౌన్స్ అవుతాయని, స్మార్ట్‌ఫోన్ అమ్మకాలకు 60 శాతం వరకు దోహదపడుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా షావోమీ, రియల్‌మీ లాంటి ప్రధాన బ్రాండ్లు ఆఫ్‌లైన్ మార్కెట్లో ఉనికిని రెట్టింపు స్థాయిలో విస్తరిస్తున్నందున అమ్మకాల పట్ల నమ్మకం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఆన్‌లైన్ గత మూడేళ్లుగా వృద్ధిని పెంచుకుంటోంది. 2018లో ఆన్‌లైన్ మార్కెట్ వాటా 38.4 శాతం ఉండగా, 2019లో 41.7 శాతానికి పెరిగింది. 2020లో ఇది 45 శాతంగా అంచనా వేస్తున్నాయి.

నిజానికి అక్టోబర్ నెలలో ఆఫ్‌లైన్ అమ్మకాలు నెలవారి ప్రాతిపదికన మొదటిసారిగా 51 శాతాన్ని దాటాయని ఐడీసీ గణాంకాలు స్పష్టం చేశాయి. అయితే, కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ విశ్లేషకుల ప్రకారం..ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్కెట్లు 60:40తో ఉన్న క్రమంలో ఆఫ్‌లైన్ మార్కెట్ ఆధిపత్యం కొనసాగించవచ్చనే అంచనాలున్నాయి. దీనికి ప్రధానంగా షావోమీ, రియల్‌మీ బ్రాండ్లు ఆఫ్‌లైన్ మార్కెట్లో డిమాండ్‌ను సాధించడమే అని తెలుస్తోంది. ‘2020 ఏడాది ప్రత్యేకమైనది. వినియోగదారులు పూర్తిగా ఆన్‌లైన్ కొనుగోళ్లపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే, లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకోవడంతో వినియోగదారులు తిరిగి ఆఫ్‌లైన్‌ అమ్మకాలను కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు’ కౌంట్‌పాయింట్ పరిశోధకులు శిల్పి జైన్ వెల్లడించారు.


Next Story

Most Viewed