Sourav Ganguly : సౌరవ్ గంగూలీ బయోపిక్.. దాదాగా ఆ హీరో..?

by  |
Sourav Ganguly : సౌరవ్ గంగూలీ బయోపిక్.. దాదాగా ఆ హీరో..?
X

దిశ, సినిమా : భారత లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ రాబోతుందని రెండేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక దాదా క్యారెక్టర్‌ ప్లే చేయబోతున్న హీరో గురించి కూడా సోషల్ మీడియాలో అనేక డిస్కషన్స్ జరిగినా.. ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే తాజాగా సౌరవ్ బయోపిక్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై లవ్ రంజన్, అనురాగ్ గార్గ్ సినిమాను నిర్మిస్తుండగా.. దాదా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ పోస్ట్ పెట్టాడు.

‘క్రికెట్ నా జీవితం. ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు తల ఎత్తుకుని నడిచే సామర్థ్యాన్ని ఇచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని లవ్ రంజన్ ఫిల్మ్స్ బ్యానర్ బిగ్ స్క్రీన్‌పై తీసుకురాబోతోంది’ అని ట్వీట్ చేశాడు. ఈ స్టేట్‌మెంట్‌తో హ్యాపీగా ఫీల్ అవుతున్న ఫ్యాన్స్.. ధోని, సచిన్ బయోపిక్స్ ఇండివిడ్యువల్ గేమ్ రైజింగ్ చూపిస్తే, దాదా బయోపిక్ వరల్డ్ క్రికెట్‌లో టీమిండియా రైజింగ్‌ను చూపించబోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక దాదా పాత్రలో బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి దాదాగా కనిపించే హీరో ఎవరు అనే దానితో పాటు మిగతా కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలోనే రివీల్ చేయనున్నట్లు వెల్లడించారు మేకర్స్. ‌

Next Story

Most Viewed