- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తిమ్మరుసు’గా సత్యదేవ్
<p>దిశ, వెబ్‌డెస్క్: ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్న యాక్టర్ సత్య దేవ్.. వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు. ఈ మధ్యే ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ప్రకటించిన ఆయన.. తాజాగా మరో సినిమా అనౌన్స్ చేశాడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ‘తిమ్మరుసు’ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన సత్యదేవ్.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై మహేశ్ ఎస్ కోనేరు, సృజన్ యరబోలు సంయుక్తంగా సినిమాను […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్న యాక్టర్ సత్య దేవ్.. వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు. ఈ మధ్యే ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ప్రకటించిన ఆయన.. తాజాగా మరో సినిమా అనౌన్స్ చేశాడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ‘తిమ్మరుసు’ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన సత్యదేవ్.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై మహేశ్ ఎస్ కోనేరు, సృజన్ యరబోలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతుందని.. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
View this post on InstagramA post shared by Satyadev (@actorsatyadev) on
కాగా, లవ్ మాక్ టేల్ రీమేక్‌గా వస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ కాగా, నాగ శేఖర్ దర్శకులు. కాల భైరవ సంగీతం సమకూరుస్తున్న సినిమాకు డైరెక్టర్ నాగ శేఖర్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం.






