హాట్ న్యూస్ : ‘అపరిచితుడు’ రీమేక్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్

by  |
హాట్ న్యూస్ : ‘అపరిచితుడు’ రీమేక్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్
X

దిశ, సినిమా : సినీ లవర్స్‌కు హాట్ న్యూస్ అందించింది పెన్ స్టూడియోస్. డైరెక్టర్ శంకర్, బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో సినిమాను ప్రకటించింది. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘అపరిచితుడు’ న్యూ వెర్షన్‌ను పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కించబోతున్నట్టుగా వెల్లడించింది. కల్ట్ బ్లాక్ బస్టర్ ‘అపరిచితుడు’ అఫీషియల్ అడాప్టేషన్ కోసం ఇండియన్ సినిమాకు సంబంధించిన రెండు శక్తులను ఒకచోటుకి తీసుకొస్తున్నామంటూ ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన పెన్ స్టూడియోస్.. ఈ న్యూస్ తెలిపేందుకు సూపర్ చార్జ్‌గా ఫీల్ అవుతున్నట్లు తెలిపారు. ఇండియన్ సినిమా మార్గదర్శకులు, మావెరిక్ మాస్టర్ క్రాఫ్ట్స్‌మన్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయబోతున్నానని తెలిపేందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని ట్వీట్ చేశాడు రణ్‌వీర్. కాగా ఈ అనౌన్స్‌మెంట్‌పై ఎగ్జైట్ అవుతున్న నెటిజన్లు.. ఈ కాంబినేషన్‌ను వర్ణించేందుకు సరికొత్త పదాలను కనుగొనాలేమో అని చెప్తున్నారు.

https://twitter.com/RanveerOfficial/status/1382205101922680832?s=20



Next Story

Most Viewed