కార్యాలయ స్థలాలకు తగ్గిన డిమాండ్

by  |
కార్యాలయ స్థలాలకు తగ్గిన డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం కారణంగా కార్పొరేట్ కంపెనీలు, ఇతర కంపెనీలు అనేక తమ సంస్థల విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు సహా ప్రధాన నగరాల్లో కార్యాలయాల స్థలాలు(ఆఫీస్ స్పేస్) లీజింగ్ 50 శాతం పడిపోయి 54 లక్షల చదరపు అడుగులకు చేరుకుందని ప్రాపర్టీ కన్సల్టెంట్ జెఎల్ఎల్ ఇండియా తెలిపింది.

జనవరి-సెప్టెంబర్ కాలంలో నికర ఆఫీస్ లీజింగ్ స్పేస్ 32.7 మిలియన్ చదరపు అడుగుల నుంచి 17.3 మిలియన్ అడుగులతో 47 శాతం పడిపోయిందని జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. అయితే, భారత ఆఫీస్ స్పేస్ మార్కెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికం కంటే సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 65 శాతం వృద్ధి సాధించినట్టు నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో 2.72 మిలియన్ చదరపు అడుగుల నికర లీజింగ్‌తో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, హైదరాబాద్ 1.54 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు ఇచ్చినట్టు జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది.

ఈ జాబితాలో పూణె 0.46 మిలియన్ చదరపు అడుగులు, ముంబై 0.28 మిలియన్ చదరపు అడుగులతో, చెన్నై 0.21 మిలియన్ చదరపు అడుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కొవిడ్-19 సంక్షోభం కారణంగా కార్పొరేట్ సంస్థలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని, విస్తరణ ప్రణాళిక్లను ఆలస్యం చేస్తున్నందున ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకునే వారు ఆసక్తి చూపించడంలేదని, పరిస్థితులు సానుకూలంగా లేనందున ఆఫీస్ స్పేస్ డిమాండ్ మరికొన్నాళ్లు ప్రతికూలంగానే ఉండొచ్చని జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది.


Next Story

Most Viewed