అక్కే నా లవ్, లైఫ్ : కృతి సిస్టర్

by  |
అక్కే నా లవ్, లైఫ్ : కృతి సిస్టర్
X

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ అంటే చెల్లెలు నూపూర్ సనన్‌కు ఎంతిష్టమో ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన అల్లరి భరిస్తున్న అక్క కృతికి థాంక్స్ చెప్తూనే ఉంటుంది. తన ద్వారానే బాలీవుడ్‌కు పరిచయమైన నుపూర్.. తనకు ప్రతీ విషయంలో సపోర్ట్ చేస్తూ.. ఫ్రెండ్లీగా ఉండే కృతికి చెల్లెలిగా పుట్టడం అదృష్టం అంటోంది.

కాగా జులై 27న కృతి పుట్టినరోజు కాగా స్పెషల్ విషెస్ అందించింది. నా లవ్, నా లైఫ్, నాకు సంబంధించిన ప్రతీదీ అక్కే అంటూ తన మీద ఉన్న ప్రేమను మరోసారి వ్యక్తపరిచింది నుపూర్. కృతిది చాలా అందమైన మనసు అని.. తనకు ప్రతీ విషయంలోనూ బెస్ట్ జరగాలని కోరుకుంది.

https://www.instagram.com/p/CDJJq8JnIDI/?igshid=rc6wr44409gc

కాగా తెలుగులో No.1 నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబు సరసన మెరిసిన కృతి.. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది.



Next Story

Most Viewed