- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో కొత్తగా 506 కరోనా కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 63,873మందికి పరీక్షలు నిర్వహించగా 506మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,75,531కి చేరింది. ఐదుగురు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,057గా ఉంది. ప్రస్తుతం 4,966 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,63,508మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 613మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,08,30,990 మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. అనంతపరం […]</p>

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 63,873మందికి పరీక్షలు నిర్వహించగా 506మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,75,531కి చేరింది. ఐదుగురు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,057గా ఉంది. ప్రస్తుతం 4,966 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,63,508మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 613మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,08,30,990 మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అనంతపరం జిల్లాలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 104, తూర్పుగోదావరిలో 41, గుంటూరులో 69, కడపలో 12, కృష్ణాలో 59, కర్నూలులో 28, నెల్లూరులో 29, ప్రకాశంలో 20, శ్రీకాకుళంలో 25, విశాఖపట్నంలో 23, విజయనగరంలో 13, పశ్చిమగోదావరిలో 66 కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.






