- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్స్టాలో యువతి నగ్న ఫోటోలు.. చూసిన ఆమె ఏం చేసిందంటే..?
<p>దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వలన ఎక్కువగా మంచే జరుగుతున్నా.. కొన్నిసార్లు దానివల్లనే యువత ప్రాణాలు కోల్పోతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఆకతాయిలు చేసిన పనికి ఓ యువతి ప్రాణాలు విడిచిన ఘటన చెన్నై లో సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. చెంగల్పట్టు జిల్లాకు చెందిన యువతి (20) ప్రైవేటు కళాశాలలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. గత కొన్ని రోజుల క్రితం ఆమె నగ్న ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యక్షమయ్యాయి. ఎవరివో నగ్న ఫోటోలకు తన […]</p>

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వలన ఎక్కువగా మంచే జరుగుతున్నా.. కొన్నిసార్లు దానివల్లనే యువత ప్రాణాలు కోల్పోతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఆకతాయిలు చేసిన పనికి ఓ యువతి ప్రాణాలు విడిచిన ఘటన చెన్నై లో సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. చెంగల్పట్టు జిల్లాకు చెందిన యువతి (20) ప్రైవేటు కళాశాలలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. గత కొన్ని రోజుల క్రితం ఆమె నగ్న ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యక్షమయ్యాయి. ఎవరివో నగ్న ఫోటోలకు తన తలను అతికించి ఉన్న ఫోటోలు కనిపించడంతో యువతి ఖంగుతింది.
ఇక ఫోటోలు చూసిన ఆమె స్నేహితుల ఆమెకు కాల్ చేసి అడగగా అది తన అకౌంట్ కాదని, ఆ ఫోటోలను ఎవరో మార్ఫింగ్ చేసి పెట్టినట్లు చెప్పింది. ఆ నగ్న చిత్రాలను చూసి ఆమె తీవ్ర దిగ్బ్రాంతి కి గురై బాధపడసాగింది. దీంతో రెండు రోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయిన యువతి బుధవారం బావిలో శవంలా కనిపించింది. కూతురు కనిపించడంలేదని యువతి తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు ఊరి చివర ఉన్న బావిలో యువతి మృతదేహం లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోటోలను పోస్ట్ చేసిన ఆకతాయిలను పట్టుకొంటామని తెలిపారు.






