వరద బాధితుల కోసం జూ.ఎన్టీఆర్ విరాళం.. ఎంత ఇచ్చాడో తెలుసా..?

181
evaru meelo kotiswarulu news

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు జనజీవనం అల్లకల్లోలం అయింది. ఎంతోమంది తమ నివాసాలను కోల్పోయారు. భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు భారీగా నష్టపోయారు. ఈ క్రమంలో జగన్ సర్కార్ తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలంటూ కేంద్రాన్ని కోరింది. సీఎం పిలుపుతో చాలా మంది ప్రముఖులు తమవంతు సాయంగా ఎంతో కొంత ప్రభుత్వానికి విరాళం అందించి ప్రజలకు తోడ్పాటునందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన వంతు సాయంగా రూ.25 లక్షలు ప్రకటించారు. వరదల్లో నష్టపోయిన వారికోసం వీటిని వినియోగించడం వల్ల ఎంతో కొంత వారికి ఉపశమనం జరుగుతుందని ఆయన ఆశిస్తున్నట్టు తెలిపారు.