- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నారైలూ అలాక్కాదు.. సీతమ్మ స్పష్టత!
<p> కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన ఎన్నారైలు పన్ను చెల్లించాలనే అంశం పెద్ద చర్చనీయంసమైంది. భారత్‌లో ఆదాయ పన్ను అంశంలో ఎన్నారైలు ఎలా భాగస్వామ్యం అవుతారనే పెద్ద ప్రశ్నకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. ఎన్నారైలు ఎవరైనా సరే తాము నివశిస్తున్న దేశంలో ఉంటూనే ఇండియాలో కూడా ఆదాయాన్ని పొందుతున్నట్టు అయితేనే పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ఇతర […]</p>

కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన ఎన్నారైలు పన్ను చెల్లించాలనే అంశం పెద్ద చర్చనీయంసమైంది. భారత్‌లో ఆదాయ పన్ను అంశంలో ఎన్నారైలు ఎలా భాగస్వామ్యం అవుతారనే పెద్ద ప్రశ్నకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. ఎన్నారైలు ఎవరైనా సరే తాము నివశిస్తున్న దేశంలో ఉంటూనే ఇండియాలో కూడా ఆదాయాన్ని పొందుతున్నట్టు అయితేనే పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
ఇతర దేశాల్లో నివశిస్తూ అక్కడ సంపాదించే దాంట్లోంచి ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టంగా చెప్పారు. బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానాన్ని అర్థం చేసుకోవడంలో అయోమయానికి గురి కావద్దని ఆమె అన్నారు. ఎన్నారైలు ఇతర దేశాల్లో ఆదాయాన్ని పొందినా కూడా ఇక్కడి ఆస్తుల నుంచి కూడా ఆదాయం పొందుతున్నట్టు తేలితే వచ్చిన ఆ ఆదాయంలోంచి పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. అవసరమైతే ఈ నిబంధనను చట్టంలో చేరుస్తామని ఆమె వెల్లడించారు.






